275 Views *బస్వాపూర్ గ్రామ శివారులో ఉన్న మోయ తుమ్మెద వాగు నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్* పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం సిద్దిపేట, వరంగల్ రోడ్ కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్వాపూర్ గ్రామ శివారులో ఉన్న మోయ తుమ్మెద వాగు ప్రవాహాన్ని పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్ వాగుకు ఇరువైపులా బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రజల […]
Breaking News
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
150 Viewsహైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 4న బండి సంజయ్ స్థానంలో ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా భాజపా కీలక మార్పు చేపట్టింది. కిషన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు. విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకునే కిషన్‌రెడ్డి బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్లను పేదలకు కేటాయించాలని […]
మణిపుర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది.
165 Viewsఇంపాల్: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ వీడియోపై రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. *ట్విటర్‌పై చర్యలు..?* అటు ఈ వీడియో వైరల్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహించింది. శాంతి భద్రతలు, […]
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు
170 Viewsరోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి వాసి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు :రాజన్న సిరిసిల్ల జిల్లా లో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సందీప్29, బండి బాబు30 లు బుధవారం వ్యక్తిగత పనులపై పల్సర్ TS 23B 5438 నెంబర్ గల బైకుపై సుద్దాల గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రగుడు రెండవ బైపాస్ […]
హైదరాబాద్: మరో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు
120 Viewsహైదరాబాద్: మరో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఎంపీ లేఖ రాశారు. లక్షల మంది నిరుద్యోగుల అవస్థలు చూడలేకే బహిరంగ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోంది? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడా నెరవేరలేదు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన […]
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
109 Viewsహైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారాస కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ మేరకు కారు దిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. […]
దిల్లీ: భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు
111 Viewsదిల్లీ: భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించిందన్నారు. మిత్ర పక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయన్నారు. ‘ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశ అభవృద్ధి సాధ్యం. ఈ […]










