*బస్వాపూర్ గ్రామ శివారులో ఉన్న మోయ తుమ్మెద వాగు నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్*
పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం సిద్దిపేట, వరంగల్ రోడ్ కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్వాపూర్ గ్రామ శివారులో ఉన్న మోయ తుమ్మెద వాగు ప్రవాహాన్ని పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్ వాగుకు ఇరువైపులా బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రజల ప్రాణాలు కాపాడడానికి తగు జాగ్రత్తలు సలహాలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు మాట్లాడుతూ రాబోవు 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్నందున వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది బస్వాపూర్, పోరెడ్డిపల్లి, లక్ష్మాపూర్ గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరియు వరంగల్ నుండి సిద్దిపేటకు వచ్చే సిద్దిపేట నుండి వరంగల్ కు పోయే వాహనదారులు పోలీసులు చూపించిన ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్ నుండి వెళ్లాలని తెలిపారు
