Breaking News

దిల్లీ: భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు

108 Views

దిల్లీ: భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించిందన్నారు. మిత్ర పక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయన్నారు.

 

‘ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశ అభవృద్ధి సాధ్యం. ఈ నినాదంతోనే ఎన్డీఏ నిరంతరం ముందుకు సాగింది. ఎన్డీఏతో కలిసి వచ్చిన ప్రతి పార్టీకి కృతజ్ఞతలు. ఆత్మనిర్భర్‌, అభివృద్ధి చెందిన భారత్‌ కోసం లక్ష్యం సాకారానికి కృషి చేశాం. భారతీయులు కొత్త సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. ఎన్‌-న్యూ ఇండియా, డి-డెవలప్ నేషన్‌, ఎ-యాస్పిరేషన్‌ ఆఫ్‌ పీపుల్‌’’ అంటూ ఎన్డీఏకు మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *