పోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట…!!
ఎల్లారెడ్డిపేట మార్చి 05 :
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి శనివారం కులాంతర వివాహం చేసుకున్నారు,
అమ్మాయి తల్లి దండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ప్రేమ జంట ఎల్లారెడ్డిపేట పోలీసులను శని వారం రాత్రి ఆశ్రయించినట్లు సమాచారం,
ఈ మేరకు
ఎల్లారెడ్డిపేట పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పెద్దలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి
కౌన్సెలింగ్ నిర్వహించి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమ జంట మేజర్లు అయినందున పెద్దలు ఎవరు కూడా ఏమీ అనడానికి వీల్లేదని ఏమైనా అంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై శేఖర్ వారందరినీ సామూదాయించి పంపినట్లు సమాచారం




