*ఎ




ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…*
*ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం*
ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట
ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం రోజున స్థానిక పాత బస్టాండ్ లో టపాసులు పేల్చి బిజెపి శ్రేణులు మండల కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అబద్ధపు హామీలతో ఇతర పార్టీలు గెలవలేరని నిబద్దతగా పనిచేసే వారే ఎన్నికలలో విజయం సాధిస్తారని లక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. కమలం వికసిస్తోందని. పట్టబద్రుల ఎన్నికలలో కూడా చిన్నమైల్ అంజిరెడ్డి కూడా అధిక మెజారిటీతో గెలుస్తారని ధీమాను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నంది నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్, వంగబాపు రెడ్డి బాబు, రవి పరుశరాములు , మిరియాలు కార్ రవి, నరసయ్య. స్వామి, ఆంజనేయులు, దొంతి రాజేందర్, గోగురి ప్రదీప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనూష్ యాదవ్ దాస్, బిజెపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
