ప్రాంతీయం

పేదలకు వరం సీఎం సహాయనిది:ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్

127 Views

 

ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని ధర్మారం సర్పంచ్ సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షుడు పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు,జగదేవపూర్ మండలం లోని ధర్మారం గ్రామానికి చెందిన బత్తుల కనకరాజు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగ స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీఎం సహయనిది దరఖాస్తు చేయగా వారికీ మంజురైన ₹ 60.000/-వేల రూపాయల చెక్కును తన చేతుల మీదుగా పంపిణీ చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరాష్ట్రంలో వేలాది మంది పేద,మధ్య తరగతి ప్రజలకు సీఎం సహయనిది వరంగా మారిందన్నారు.  గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు వైద్య సేవల కోసం సీఎం సహయనిది కార్యక్రమలు చేపట్టలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్  పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు,ఆత్మ కమిటీ డైరెక్టర్ ఐలయ్య, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *