మేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమం
సెప్టెంబర్ 19
(బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా)
బీబీపేట్ మండలంలోని జనగామ, మాంధాపూర్, ఉప్పర్ పల్లి, ఇస్సానగర్, రాంరెడ్డి పల్లి గ్రామంలో మహిళలు, పెద్దల నుండి అమృత కలశంలో మట్టి సేకరించిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి,
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల స్మరించుకునెందుకు కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీ లో స్మృతి వనం నిర్మిస్తుంది అని అన్నారు. ఈ స్మృతి వన నిర్మాణానికి దేశంలోని ప్రతి గ్రామం నుండి మట్టి సేకరణ చేసి ఆ స్మృతి వన నిర్మాణం లో ఆ మట్టిని ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ, పిలుపునిచ్చారు. అని,
అందులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గం లోని ప్రతి గ్రామం నుండి మట్టి సేకరిస్తున్నామని ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, పెద్దలు పాల్గొంటున్నారని అన్నారు.
