ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు
పాఠశాల స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల లోని మిగతా విద్యార్థులకు విద్యాబోధన చేశారని రాయపోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా అన్నారు. రాయపోల్ మండలం కేంద్రమైన ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయుల విధుల పట్ల పాఠశాల విధులు సమాజం తీరుపై అవగాహన కలిగే విధంగా నిర్ణయించడం జరుగుతుంది దీనిలో భాగంగానే విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి మిగతా తరగతి విద్యార్థులకు ఒక్కరోజు విద్యాబోధన చేయడం జరిగిందన్నారు. ఐదవ తరగతి విద్యార్థులు ఆర్ జె డి గా భాగ్యశ్రీ, కలెక్టర్ గా యశ్వంత్, డీఈవోగా వినయ్, డిప్యూటీ ఈవోగా శ్రీ నందు, ఎంఈఓ గా అస్మిత ప్రధానోపాధ్యాయులకు సౌమ్య, అనన్య, మిగతా విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా పాఠ్యాంశాలు బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ ,సురేష్ ,కృష్ణ, విజయ పాల్గొన్నారు.




