- విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యంపై పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్*
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూలు యాజమాన్యం మోతాదుకు మించి విద్యార్థులను బస్సులో తీసుకెళ్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూలు బస్సు సీటింగ్ కెపాసిటీ 30 మంది ఉంటే 60 మందిని తీసుకెళ్తున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూల్ బస్సులో 60 మంది విద్యార్థులను తీసుకెళ్తున్నారు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుకుంటూ కాలం చెల్లిన వాహనాలను తీసుకెళ్తూ నిబంధనలకు విరుద్ధంగా బస్సులో నడుపుతున్న విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విజ్ఞాన్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఈఓ గారికి మరియు జిల్లా రవాణా శాఖ అధికారికి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఫిర్యాదు చేశారు లేనియెడల డీఈవో మరియు రవాణా శాఖ జిల్లా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు మరియు ప్రమాదానికి గురైన విద్యార్థులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపారు ఈకార్యక్రమంలో వెంకటరెడ్డి సల సత్యం రెడ్డి రేపాక రామచంద్ర రెడ్డి జితేందర్ రెడ్డి బొమ్మాడి స్వామి హరి కృష్ణ విజయ్ బోనాల సాయికుమార్ సాయి కిరణ్ నాయక్ ఎలేందర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు




