తెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 14
తొర్రూర్ డివిజన్ పెద్ద వంగర మండలం, చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు కళ్యాణ్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు.
టీఎస్ పి ఎస్సి నీర్వహించిన అసిస్టంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఏ ఈ ఈ) పరీక్ష మరియు గ్రూప్ – 4 పరీక్షలలో మెరిట్ మార్కులు సాధించి ఓపెన్ కోటాలో రెండు ఉద్యోగాలను పొందడం జరిగింది.
చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు బిక్షపతి ఉమారాణి దంపతులకు చెందిన వారీ కుమారుడు కళ్యాణ్ గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి కోచింగ్ లేకుండా,కష్టపడి చదువుతూ మొదటి ప్రయత్నంలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం జరిగింది.
ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తన అమ్మ నాన్న మరియు కుటుంబ ప్రోత్సాహంతో తాను కష్టపడి చదివి ఉద్యోగాన్ని సాధించినట్లు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.




