ప్రాంతీయం

ఘనంగా బాలికల దినోత్సవం…

143 Views

ముస్తాబాద్ జనవరి 24, ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని జాతీయ బాలికల దినోత్సవం” సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్ మాట్లాడుతూ 2008 సం.లో ఇండియన్ నేషనల్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టరి జనవరి 24 ను నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ప్రకటించింది. అందులో భాగంగా బాలికల కొరకు ప్రత్యేక సాధికారత సాధించే క్రమంలో సమాజంలో వారి పరంగా కనబడే వివక్ష తొలగించి లింగ సమానత్వం బాలికల సంరక్షణ ఆవశ్యకత అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించి పూర్తి రక్షణ కోసం “స్వీయ రక్షణ” కరాటే శిక్షణ లు ఏర్పాటు ద్వారా అబలలు కాదు సబలలు అని నిరూపించే ప్రయత్నాలు అనేకం జరగాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థినులు ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *