ప్రాంతీయం విద్య

విద్యార్థినీ, విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ

126 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16)

సిద్దిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కూక్ లో ఈరోజు పాఠశాల స్ఫూర్తి ప్రదాత లయన్ జి ఆర్ సూర్య రాజు మరియు తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశ్ చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జి. ఆర్ సూర్య రాజు మాట్లాడుతూ టెక్నికల్ విద్య చదువు కోవాలని పాలిటెక్నిక్, ఐటిఐ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి వాటిని చదువుకుంటే త్వరగా ఉద్యోగం సంపాదించవచ్చని లేదా స్వంతంగా వ్యాపారం చేసుకోవచ్చని, గౌరవం గా, ఉన్నతంగా బ్రతుకవచ్చని తెలిపారు. సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ విద్య అనే ఆయుధం తొ పేదరికాన్ని తొలగించవచ్చు కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత చదువులు చదవాలని మంచి, పేరు తీసుకురావాలని ఉద్యగ, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు
జి వెంకటేశం మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు పది జి పి ఎ పొందడానికి క్రుషి చేయాలని కోరారు. క్లాస్ టీచర్స్ యం. రమణారావు,
ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ చదువు ద్వారానే విద్యార్థులు అభివృద్ధి చెందివచ్చని, మంచి స్థితికి చేరుకోవాలని కోరుకున్నారు. లయన్ అమర్నాథ్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ తీసుకున్నారు. ఆర్ ఆర్ కాలనీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవితా మేడం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరహరి ప్రసాద్, భూజాత, పద్మా రెడ్డి, విధ్యాధర్ రెడ్డి , రమేష్ , సంతోష, రజినీ, సిద్దయ్య , కృష్ణ , భ్రమరాంబ మేడం , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. లయన్ సూర్య రాజు పాఠశాల మధ్యాహ్న భోజన పథకం కొరకు వంట పాత్రలు కొనడానికి ₹20000/ విరాళం అందించారు. పాఠశాల స్కావేంజర్ లక్ష్మి కి నెల వేతనం అందించారు.

No Slide Found In Slider.

Poll not found