Breaking News

ఎల్లారెడ్డిపేట మండలంలో ట్రా “ఫికర్”…..

192 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆరెకటిక డబ్బాల వద్ద జనం మటన్ చికెన్ కోసం ఇసుక వేస్తే రాలనంతగా బారులు తీరారు. పండుగ వస్తే చాలు ఆదివారం పండుగ రోజుల్లో బైపాస్ రోడ్డు పక్కనే మాంసం అమ్మే దుకాణాలు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డుపైనే నిలుపుతున్నారు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంటున్నారు సంక్రాంతి పండుగ వాతావరణం లో ట్రాఫిక్ మొత్తం బైపాస్ రోడ్డు వద్ద గుమ్మిగూడినట్లు ఉన్నారు రోడ్డు మొత్తం బ్లాక్ అయినట్టుగా ఉందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మాంస ప్రియుల కోసం కటిక డబ్బాలను వినియోగదారులకు ప్రశాంత వాతావరణంలో ఉంచాలని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వీరి కోసం ప్రత్యేక స్థలాల్లో మాంసం అమ్మే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామ పాలకవర్గాన్ని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు కోరుతున్నారు

No Slide Found In Slider.

Poll not found