ముస్తాబాద్ జనవరి15, బీఎస్పీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు .
ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహేన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సూడిది నవీన్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి 27 లక్షల ప్రభుత్వ భూమిని ప్రతి పేదవాడి పంచిన వ్యక్తిగా అదేవిధంగా 12 లక్షలు ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇచ్చిన ఘనత మాయావతికి దక్కుతుందని ఆమె మార్గంలో తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో రాజ్యాధికారాన్ని అందుకొని ఉత్తరప్రదేశ్ లో మాయావతి చేసిన అభివృద్ధి పనులను మరలా చేసి తెలంగాణ అభివృద్ధిలో బహుజన సమాజ్ పార్టీ చిరస్థాయిలో నిలిచిపోయేలా పనిచేస్తామని తెలియజేయడం అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఎకరం భూమి లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని అదేవిధంగా బీసీలకు 70 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని తెలియజేసిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ ,నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన నాయకత్వంలో తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని నిర్మిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఆరేపల్లి రఘుపతి, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ,కొమ్మట వెంకటేష్, మండల కమిటీ సభ్యులు సుంకరి భాను సాయికుమార్ రవి కుమార్, ప్రణయ్, హరిబాబు, రాజు, నాగేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు




