ఆధ్యాత్మికం

అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణం

134 Views
    ముస్తాబాద్ జనవరి 14, మండలంలోనిత శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామిల కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఎంతో వైభవ పేతంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ముస్తాబాద్ మండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి  భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లలిత శాస్త్ర పారాయణం చేశారు. నెల రోజులపాటు నిర్వహించిన భజన కార్యక్రమం శనివారంతో  గోదాదేవి కళ్యాణం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పుష్కరించుకొని నెలరోజుల పాటు ముస్తాబాద్ మండలంలోని అన్ని వాడలకు చెందిన భక్తులు భక్తిశ్రద్ధలతో పాలీల వారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణం కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి కనుల పండుగకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్