Breaking News విద్య

పేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు.

143 Views

పేద విద్యార్థులకు వరంగా
మారిన గురుకుల పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు

శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు తీర్చిదిద్దాలి

ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి

రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్య పేద విద్యార్థులకు వరంగా మారిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు . బుదవారం చౌదర్ పల్లి లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు బెడ్ షీట్స్ , నోట్ బుక్స్ , ప్యాడ్స్ , స్కూలు బ్యాగ్స్ , ష్యూస్ పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు . ప్రభుత్వ పాఠశాలల్లోనే చక్కని విద్య అందుతుండగా గురుకుల తరహాలో , ఆంగ్ల మాధ్యమంలో విద్యనoదిస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని స్పష్టం చేశారు . దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ పేద వర్గాల విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు . కాగా ప్రతి విద్యార్థి పై రూ , లక్ష 25 వెచ్చిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుండగా , ఇష్టపడి చదువి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు . కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాగా , పేద విద్యార్థులు నాణ్యమైన విద్యతో చక్కటి భవిష్యత్తు పొంది ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు . సమయాన్ని వృధా చేయకుండా విద్యార్థులు తమ దృష్టి అంతా విద్యపై ఉంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు . పోటీపరీక్షల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటుతుoడగా, శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు విద్యార్థులను తీర్చిదిద్దాలని వివరించారు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాలు యాదవ్ , ఉపసర్పంచ్ పొద్దుటూరి శ్రీనివాస్ , సీనియర్ నేత తుమ్మ గణేష్ , ప్రిన్సిపాల్ వాసుదేవా చార్య తదితరులు పాల్గొన్నారు .

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7