Breaking News

ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు

80 Views

తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు ప్రజలు సిద్ధమ య్యారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు.

కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

రాశి ఫలాలు, పంచాంగ శ్రవణాలు వినేందుకు ఆసక్తితో ఎదురుచూ స్తున్నారు.ఉగాది వేడుకల పూజా సామాగ్రి కొనుగోలు తో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.

ఉగాది పచ్చడికి అవసర మైన మామిడికాయలు, వేపపువ్వు, బెల్లం తదితర సామగ్రి కొనుగోలుదారు లతో మార్కెట్‌లు సందడిగా కనిపించాయి.

పల్లె, పట్టణం తేడా లేకుం డా మార్కెట్ ఏరియాలన్నీ పూల అంగళ్లు జనంతో కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా పూల కొనుగోళ్లకు డిమాండ్‌ కావడంతో అధిక ధరలు పలికాయి.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్