దౌల్తాబాద్; మండల వ్యాప్తంగా ఇటీవల అక్రమంగా తరలిస్తూ పట్టుకున్న పిడిఎస్ బియ్యానికి శుక్రవారం సివిల్ సప్లై ఉప తహసిల్దార్ లు స్వామి, జైనుల్ అబిదిన్ ల ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని వేలంపాట నిర్వహించారు. 512 క్వింటాళ్ల 70 కిలోల బియ్యంను వేలం పాట నిర్వహించగా కొనుగోలు దారులు పబ్బ అశోక్, మహేష్, శ్రీనివాస్ రావు, రాజు వేలం పాటలో పాల్గొనగా ఆ బియ్యానికి కిలో ఒక్కంటికి 13.50 పైసలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్ఐ మధుసూదన్, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్, గిడ్డంగి ఇంచార్జ్ మల్లేశం తదితరులు ఉన్నారు…




