ప్రాంతీయం

 దిష్టిబొమ్మ దగ్దంచేస్తున్న అయ్యప్ప దీక్షాస్వాములు…

103 Views

హిందువుల మనోభావాలతో ప్రభుత్వాలకి లెక్కలేదా అంటున్న అయ్యప్ప దీక్షాపరులు …

అయ్యప్ప స్వామిని కించపరిచేలా వాఖ్యలు చేసిన బైరి నరేశ్ దిష్టి బొమ్మను ముస్తాబాద్ అయ్యప్ప స్వామి సమితి ఆధ్వర్యంలో దహనం చేశారు.

ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి డిసెంబర్ 30, రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష నేతలతో కలసి అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు చేసిన బైరి నరేశ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని తెలంగాణతల్లి చౌరస్తా నుండి అయ్యప్ప మాలదారులు, సేవా సమితి సభ్యులు, పార్టీ నేతలు బైరి నరేశ్ చిత్రపట్టాని చెప్పులతో కొడుతూ వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.

నాస్తికత్వం ముసుగులో హిందూ దేవీ దేవతలను దూశించడం పరిపాటిగా మారిందని ఆవేధన వ్యక్తం చేశారు .
ఇతర మతాలపై దూషణ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి పీడీ యాక్టులు నమోదు చేస్తుందని , అలాగే హిందూ వ్యతిరేకులపై సహితం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా హిందూ దేవుళ్లను అవమాన పరుస్తూ ప్రసంగించిన బైరి నరేశ్ ను ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి పీడి యాక్ట్ ను నమేదు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే రాజకీయంగా ఎదగడానికి కొంతమంది ఇలాంటి నీచ రాజకీయాలకి పాల్పడుతున్నారని తెలిపారు.
రాజకీయ పార్టీలపై ఆరోపనలు చేయాలి తప్ప దేవుళ్లను కించపరిచే విధంగా ప్రసంగాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయ్యప్ప స్వామిపై చేసిన వాఖ్యలు వెనక్కుతీసుకోని బహిరంగా క్షమాపన చేప్పాలన్నారు. లేని పక్షలంలో రాష్ట్రంలో ఎక్కడ


తిరిగిన అడ్డుకుంటామని హెచ్చరించారు.
అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని ఎస్ఐ వెంకటేశ్వర్లకు ఫిర్యాధు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, అయ్యప్ప సేవా సమితి సభ్యులు మురికి వెంకటేశం, కాలువ బాలజీ, గోపిశేట్టి సంతోష్, కొండ యాదగిరి, గూడెపు దేవేందర్, గందే రమేశ్, సత్యనారాయణ, జగన్, కోయ రాము, బీరువాల రాజు, మల్లారపు సంతోష్ రెడ్డి, తమ్మల రాంగోపాల్, సత్యం చారి తదితరులు పాల్గొన్నారు .

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్