ప్రాంతీయం

రేపు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక సమావేశం

8 Views

రేపు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక సమావేశం – సాగునీటి హక్కుల ‘ప్రజా ఉద్యమం’ సంకేతాలు

 తెలంగాణ, డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 

ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా దాదాపు నిశ్శబ్దం పాటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మళ్లీ పబ్లిక్ అరేనాలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని చర్చలను ఆయన ఫామ్‌హౌస్‌ నుంచే నడిపిస్తుండగా రేపు అయితే ప్రత్యక్షంగా తెలంగాణ భవన్‌కు వస్తున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్సీ–రాష్ట్ర కార్యవర్గాల సంయుక్త సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ స్వయంగా అధ్యక్షత వహించనుండటం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.ఈ భేటీలో ముఖ్యంగా.కృష్ణా, గోదావరి సాగునీటి హక్కుల పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై వ్యూహాత్మక ప్రతికార చర్యలు‘మరో ప్రజా ఉద్యమం’ ప్రకటనా అవకాశం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బలమైన ప్రణాళిక అంటూ కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.బీఆర్ఎస్ వాదన ప్రకారం  తాము ప్రభుత్వం సమయంలో 91 టీఎంసీల కేటాయింపుల కోసం ప్రణాళికలు రూపొందించగా,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకే అంగీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు లాభం చేరుతోందని,రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదమని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ అడ్డుకోవడంలో వైఫల్యం వంటి అంశాలపై కేసీఆర్ బహిరంగంగా ఆక్షేపణలు చేసే అవకాశముంది.సమావేశం అనంతరం మీడియా ముందు కేసీఆర్ మాట్లాడి, ‘యుద్ధ ప్రాతిపదికన’ చేపట్టబోయే కార్యాచరణను ప్రకటించవచ్చనే పార్టీ వర్గాల అంచనా. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ సందడి చేయబోతుండటంతో, గులాబీ కేడర్‌లో మళ్లీ ఉత్సాహం పుట్టుకొస్తోంది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *