తొగుట; మరుపల్లి శ్రీనివాస్ గౌడ్..తెలంగాణ ఉద్యమంలో తొగుట మండలంలో ఇతని పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు.. కాన్గల్ గ్రామానికి చెందిన మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ (43) టీడీపీ లో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై 2001లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆసమయంలో అందె గ్రామంలో చెరుకు ముత్యంరెడ్డి సభను అడ్డుకొని వార్తల్లోకి ఎక్కారు..ఎక్కడ టిఆర్ఎస్ సభ నిర్వహిస్తే అక్కడ శ్రీనివాస్ గౌడ్ కనిపించేవాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. వార్డు సభ్యునిగా, రెండు సార్లు విద్యాకమిటీ చైర్మన్ గా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గా, ప్రధాన కార్యదర్శి గా పనిచేశాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ గౌడ్ పొన్నాలలోని తన బంధువుల ఇంటికి కాలినడకన వెళుతూ ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఆయన మరణంతో గులాబీ శ్రేణులు, గ్రామస్తులు, స్నేహితులు విషాదానికి లోనయ్యారు.
ఉద్యమ సహచరుడు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు ఇక లేరనే వార్తను వారు జీర్ణించుకోలేక పోతున్నారు..ఆయన మరణ వార్త తెలుసుకున్న మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు..ఆయన అకాల మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ పక్షాన నివాళి అర్పిస్తున్నామని తెలియజేశారు…మరణవార్త తెలుసుకున్న వెంటనే మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లు సంఘటనా స్థలం కు చేరుకున్నారు.. ఆసుపత్రిలో ఆయన పార్థీవ దేహానికి నివాళి అర్పించారు.. పరామర్శించిన వారిలో రైతుబంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, ఎంపీటీసీ వేల్పుల స్వామి, తదితరులు ఉన్నారు…. శ్రీనివాస్ గౌడ్ మరణంతో భార్య సుమలత, కుమార్తెలు మణిప్రసన్న, ప్రియదర్శిని, తల్లి భాగ్యమ్మల శోకానికి అంతు లేకుండాపోయింది..ఈరోజు అనగా బుధవారం రాత్రి కాన్గల్ లో శ్రీనివాస్ గౌడ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు..
