ముందస్తు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ కొండ రమేష్ గౌడ్
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకల కార్యక్రమంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టత గూర్చి తెలిపారు.రానున్న బతుకమ్మ పండుగ వేడుకలను గొల్లపల్లి గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని,అందుకు సంబంధించిన ఏర్పాట్లను గ్రామ పంచాయతీ పాలకవర్గం చేస్తుందని అన్నారు. పాఠశాలలో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్,విద్యార్థులు పాల్గొన్నారు.





