సహాయం….
ఎల్లారెడ్డిపేట జూలై 03 :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం షేరీఫా కుటుంబానికి గూడుమియ్యా ద్వారా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు, నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షరీఫా కుమారుడు అథీక్ వారం రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమాన స్పందంగా మరణించారు,సోమవారం అథీక్ దశదినకర్మ సందర్భంగా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వాళ్ళ బంధువైన గూడుమియ్యా కు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేశారు, ఈ సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ
సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి చాలా మంది నిరుపేదలకు ఆర్థీక సహాయం అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు,నిరుపేదలు ఏవరైనా ఉంటే కృష్ణారెడ్డి ని సంప్రదించాలని ఆయన చెప్పారు ,ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు హాసన్ బాయి, ఎలగందుల నరసింహులు, బందారపు బాల్ రెడ్డి, గంట దేవగౌడ్ , నాగరాజ్, ఇస్మాయిల్ రియాజ్ , సద్దాం తదితరులు పాల్గొన్నారు,
