గుండారం గ్రామంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ పాల్గొన్నారు.ఉపాధ్యాయులు,వార్డు సభ్యులు అమల,సంపూర్ణ,పద్మ,హరీష,పిల్లల తల్లితండ్రులు కలిసి పిల్లలతో ఆటపాటలతో ముందస్తు బతుకమ్మ సంబరాలు కార్యక్రమంలో భాగమయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని రానున్న బతుకమ్మ పండుగను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లను గుండారం గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున చేస్తున్నామని ప్రజలంతా పండుగ సంబరాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా సర్పంచ్ మూడవత్ సరోజ చంద్రునాయక్ కోరారు.





