జాతీయ కార్యదర్శిగా ఎండి. లాల్ మొహమ్మద్
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎండి.లాల్ మొహమ్మద్ ఆర్కే ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లో గత కొద్ది రోజులుగా తన సేవలందిస్తున్నారు.మొదట జిల్లా బాధ్యులుగా,తదుపరి రాష్ట్ర బాధ్యులుగా,ఆపిదప జాతీయ కార్యదర్శిగా నియామకం అయ్యారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుడిది రాజేందర్ ఎండి లాల్ మహమ్మద్ ఆర్కే ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లో అనతి కాలంలో తన అమూల్యమైన సేవలను అందిస్తూ అసోసియేషన్ విస్తరణకు చేసిన కృషిని, ఆయన చేసిన సేవలను గుర్తించిన అసోసియేషన్ అతడికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడం జాతీయ కార్యదర్శిగా నియమించడం సంతోషదాయకం అన్నారు ఈ సందర్భంగా లాల్ మహమ్మద్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలుపుతున్నామని భవిష్యత్తులో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చట్టపరంగా న్యాయపరంగా హక్కుల పరంగా ఏవైనా సమస్యలు వస్తే ఆర్కే ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శిగా వారికి అండగా నిలవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు లాల్ మహమ్మద్ శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.





