
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి
సూపర్వైజర్ వనిత,సర్పంచ్ తిరుపతి నాయక్
TS తెలుగు న్యూస్ 24/7: సోమవారం బుగ్గరాజేశ్వర తండా గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ తిరుపతి నాయక్,సూపర్వైజర్ వనిత సందర్శించారు.ఈ సందర్భంగా వారు అంగన్వాడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పౌష్టికమైన,నాణ్యమైన ఆహారం అందించాలని, గర్భిణీ స్త్రీలకు అందాల్సిన సేవలను తూచా తప్పకుండా అందించాలని,పిల్లల్లో గల సృజనాత్మకతను బయటకు తీసే విధంగా విద్యా బోధన చేయాలని సూచించారు.ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ వనిత ను సర్పంచ్ తిరుపతి నాయక్ శాలువాతో సత్కరించారు.ఇక్కడ అంగన్వాడీ టీచర్ వినోద సిబ్బంది కలరు.





