Breaking News విద్య

ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే మీ ఇంటి గర్ పట్టి చెల్లిస్తా: ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి

25 Views

అందరికీ ఆదర్శంగా నిలిచిన రాజన్నపేట ఉపసర్పంచ్ ఉడుగుల యాదగిరి

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన కుమారుడిని చేర్పించిన ఉపసర్పంచ్

గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వారి ఇంటి టాక్స్ (గర్ పట్టి) స్వంతంగా చెల్లిస్తానని ప్రకటన

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన కుమారుడు ఆరవ తరగతి చదువుతుండగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల బలోపేతానికి కృషి చేస్తానని అందుకు ఓ ప్రజా ప్రతినిధిగా తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గ్రామస్తులకు వాగ్దానం చేశారు.ఎవరైతే ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తారో వారి ఇంటి టాక్స్ (గర్ పట్టి) తాను స్వయంగా చెల్లిస్తానని ప్రకటించారు.తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే కాకుండా గ్రామస్తులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే గర్ పట్టి కడతానని హామీ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలవడంతో పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఉపసర్పంచ్ ను అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *