ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ రిన్సీ జార్జ్ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు .అనంతరం కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛమైన మనసుతో సానుకూల దృక్పథంతో విద్యతోపాటు విలువలను నేర్పుతూ విద్యార్థి జీవితంలో వెలుగులను నింపుతున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రిన్సీ జార్జ్ .ఏవో పద్మావతి ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
