రాజకీయం

బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు గా ఉడుగుల యాదగిరి

7 Views

బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా
రాజన్నపేట గ్రామ ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి

TS తెలుగు న్యూస్ 24/7: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా రాజన్నపేట గ్రామ ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి నూతనంగా నియమితులయ్యారు,భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ని యాదగిరి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన ఉడుగుల యాదగిరిని, జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.పార్టీ బలోపేతం,ఎస్సీ మోర్చా సంస్థాగత అభివృద్ధి,కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి కృష్ణహరి,అంతర్పుల తిరుపతి , బాలగౌడ్,ప్రశాంత్,శ్రీనివాస్ రెడ్డి,సాయి తదితరులు పాల్గొని నూతన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతీయ జనతా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా నూతన బాధ్యతలతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని తనకు ఈ అవకాశం కల్పించిన మండల,జిల్లా పార్టీ నాయకులకు ఉడుగుల యాదగిరి ధన్యవాదాలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *