పుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో., 4ఏళ్ల కిందట పుల్వామాలో ముష్కరుల బాంబు దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు చిన్నారి విద్యార్థులు కొవ్వొత్తుల నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుండి బాగా చదివి, దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పప్పుల శ్రీనివాస్, కులేరి ప్రేమ్ సాగర్, కవిత, అంజయ్య, వెంకటలక్ష్మి, పద్మ, లక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.




