మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా CMRF చెక్కుల పంపిణీ.
మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల, నస్పూర్ మరియు హజీపూర్ మండలాలకు చెందిన 111 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి విలువైన (53,90,800 )/-రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోనే మన మంచిర్యాల నియోజకవర్గానికి 2911 CMRF చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, జిల్లా ఆత్మ చైర్మన్ సింగతి మురళి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు , నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




