
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు,నోట్ బుక్కులు,బెడ్ షీట్లు పంపిణీ చేసిన సర్పంచ్
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నాగెల్లి వెంకట్ రెడ్డి,ఉప సర్పంచ్ కొర్రి అనిల్ ఉపాధ్యాయుల తో కలిసి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్,బెడ్ షీట్లను పంపిణీ చేశారు.విద్యార్థులందరూ శ్రద్ధతో చదివి ఉన్నత మార్కులు సాధించి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న ఉచిత మౌలిక వసతులను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ అజంతా ఉపాధ్యాయ బృందం హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





