Breaking News విద్య

ప్రైవేట్ స్కూల్ వాహనాలు మా గ్రామం లోకి రావద్దంటూ వెలసిన ఫ్లెక్సీ

332 Views

బండలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం: సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్

పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు అభినందించిన ఎంఈఓ

మా గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు వాహనాలకు ప్రవేశం లేదంటూ వెలసిన ఫ్లెక్సీ

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆలోచనకు గ్రామస్తులు తోడయ్యారు. మంగళవారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు   గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే అందిద్దామని తీర్మానించుకున్నారు. అందుకు తగ్గట్లుగా మౌళిక వసతులను,సౌకర్యాలను పంచాయతీ పాలకవర్గం కల్పిస్తుందని గ్రామస్తులకు నమ్మకం కల్పిస్తున్నారు.పాలకవర్గ కృషికి ఎంఈఓ అభినందిస్తూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.కాగా గ్రామ శివారులో బుధవారం బండ లింగంపల్లి గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు వాహనాలకు అనుమతి లేదని ఫ్లెక్సీ వెలిసింది.సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ చేస్తున్న ప్రయత్నం చూపుతున్న చొరవ మండల వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *