ప్రాంతీయం

హరిదాస్ నగర్ గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

24 Views

మహిళా సంఘం భవనం,గోదాం నిర్మాణాలకు భూమి పూజ చేసిన సర్పంచ్ చిర్రo నాగరాజు

ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాభేరాబేగం

హరిదాస్ నగర్ గ్రామంలో నలభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామంలో 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగంతో కలిసి బుధవారం సర్పంచ్ చిర్రo నాగరాజు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ హరిదాస్ నగర్ గ్రామానికి ఇప్పటికే 15 లక్షల రూపాయల సీసీ రోడ్లను ఇవ్వడం జరిగిందని పని కూడా పూర్తయిందన్నారు.బతుకమ్మ ఘాట్ వరకు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహాయంతో విద్యుత్ లైన్ల పనిని కూడా పూర్తి చేశామని అన్నారు.5 లక్షల రూపాయలతో మురికి కాలువ నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు.ఇప్పుడు నలభై లక్షల రూపాయలతో మహిళా సంఘ భవనం,గోదాం నిర్మాణం చేపట్టనున్నామని,భవిష్యత్తులో హరిదాస్ నగర్ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు కావాలన్నా మా ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేస్తున్నారని రెండో విడత మంజూరైన ఇండ్లను కూడా నిరుపేదలకే కేటాయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,ఉప సర్పంచ్ సతీష్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి,డైరెక్టర్ మెండె శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు రొడ్డ రామచంద్రం,మల్లారెడ్డి,నంది కిషన్, గంట బుచ్చగౌడ్,గంగయ్య,పరుశురాములు,ఎల్లయ్య, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *