
- సర్పంచ్ వేతనం సర్కార్ బడికి వితరణ ప్రకటన
గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.సర్పంచ్ లకు ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయల నెలవారీ గౌరవ వేతనం 30 వేల రూపాయల నిధులు విడుదల కావడంతో వాటిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల అవసరాలకు కేటాయిస్తానని సోమవారం ప్రకటించారు. సర్పంచ్ వేతనం సర్కార్ బడికి వితరణ ప్రకటనతో పాలక వర్గం,పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.





