ప్రాంతీయం

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. హానికరమైన విషయాలకు ధైర్యంగా “నో” చెప్పండి : మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్

4 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. హానికరమైన విషయాలకు ధైర్యంగా “నో” చెప్పండి : మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్*

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలలో భాగంగా,ఈరోజు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కేరళ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు రూపొందించిన చిత్రాలను పరిశీలించి వారిని అభినందించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం,పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అరెస్టులు చేస్తున్నప్పటికీ, కొంతమంది యువత తెలిసో తెలియకో వాటి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన చిత్రాల ద్వారా డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను చక్కగా వివరించారని అభినందించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానసిక సమతుల్యత దెబ్బతిని,కుటుంబ సభ్యులతో పాటు సమాజానికీ ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు.సాధారణంగా చిన్న ఆసక్తితో సిగరెట్ లేదా ఇతర మత్తు పదార్థాలను ప్రయత్నించడం ప్రారంభమై,క్రమంగా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ వ్యసనాల కారణంగా కొందరు దొంగతనాలు వంటి నేరాలకు కూడా పాల్పడే పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. అందువల్ల విద్యార్థులు చిన్న వయస్సు నుంచే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవితానికి అవసరమైన విలువలను కూడా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తమకు నచ్చని లేదా హానికరమైన విషయాలకు ధైర్యంగా “నో” చెప్పడం నేర్చుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుంచే “నో” చెప్పే అలవాటు పెంపొందితే భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా ఎదుగుతారని తెలిపారు.విద్యార్థులు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలను గమనించినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే డయల్-100కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు.మంచి పౌరులుగా, బాధ్యతాయుతమైన విద్యార్థులుగా ఎదిగి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజాన్ని కూడా అప్రమత్తం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్,ఎస్‌ఐ సంతోష్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *