ప్రాంతీయం

ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం

39 Views

ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు అజ్మీరా నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం యోగ వివిధ ఆసనాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మీరా నరసింహ మాట్లాడుతూ, యోగ ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రంజిత్ కుమార్, ఇతర ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. యోగ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *