
డెబ్భై వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కొండ ఆంజనేయులు గౌడ్
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం లోని గొల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నీరు త్రాగడం కోసం డెబ్భై వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శరీరానికి కావాల్సిన నీరు సమయానికి త్రాగి ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశ్యంతో వారికి వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్,పలువురు గ్రామస్తులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





