Breaking News ప్రాంతీయం

తాటిచెట్టుపై నుండి పడిన గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు..

75 Views

ముస్తాబాద్, జూన్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం చీకుడు గ్రామంలో తీవ్ర విషాదం. కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… మండలానికి చెందిన గున్నాల కృష్ణగౌడ్ వయసు 59 సం. సాయంత్రం సమయాణ ఎప్పటిలాగే కల్లు గీతకోసం తాటి చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో కాలుజారి ఎత్తు నుంచి పడినట్లు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ముఖానికి, చేతులకు, నడుముకి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని తోటి గీత కార్మికులు, స్థానికులు కోరుతున్నారు.

← Back

Thank you for your response. ✨

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *