విద్య

అందరికీ ఆదర్శంగా నిలిచిన నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్

91 Views

అందరికీ ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ మాదాసు అనిల్

తన కూతురు ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల పై విశ్వాసం పెంచిన సర్పంచ్

TS తెలుగు న్యూస్ 24/7: ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్ ప్రభుత్వ పాఠశాలలో తన కూతురును చేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య,మెరుగైన మౌలిక సదుపాయాలు,అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయుల సేవలు అందుబాటులో ఉన్నాయని,తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేస్తానని చాటి చెబుతూ తన కూతురు అభిజ్ఞ ను ఎనిమిదవ తరగతిలో నామాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచి ప్రభుత్వ పాఠశాల పట్ల విశ్వసనీయతను పెంచారు.ఈ సందర్భంగా పదానోపాధ్యాయులు డి.హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం సమాజానికి మంచి సందేశం ఇస్తుందని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యను,ఉచిత సౌకర్యాలను వినియోగించు కోవాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో ఉపాద్యాయులు భాస్కరాచారి,సుధాకర్,సువర్ణ, నాగేశ్వర్లు,శ్రీనివాస్,భాస్కర్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *