
బండలింగంపల్లిలో ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్న గ్రామస్తులు
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం గ్రామంలోని ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలని,గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు బస్సులు వాహనాలు రాకూడదని ప్రభుత్వ బడిలో సకల సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం కృషి చేయాలని గ్రామపంచాయతీలో తీర్మానించారు.ఈ మేరకు బుధవారం ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈ సంఘటనతో కంగుతిన్న ప్రైవేట్ స్కూల్ వాహనదారుడు తిరిగి వాపస్ వెళ్ళిపోయారు.పాలకవర్గం ప్రభుత్వ బడిని బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని గ్రామస్తులు అభినందించారు.ఇక్కడ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్,ఉప సర్పంచ్ బొద్దురాజు,విద్యా కమిటీ చైర్మన్ వజ్రవ్వ నర్సయ్య, వార్డు సభ్యులు శ్రీనివాస్,గ్రామస్తులు దయాకర్ రెడ్డి, గంగవరపు శ్రీనివాస్,మద్దుల వేణుగోపాల్ రెడ్డి,చరణ్ గౌడ్,సాయి గౌడ్,ఖాసీం,మాచర్ల దేవరాజు,తాఫిక్, ఆకారం రమేష్ తదితరులు పాల్గొన్నారని గ్రామస్తులు తెలిపారు.





