కరీంనగర్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణా స్టేట్ చైర్మన్ డాక్టర్ నోముల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి గ్రామంలోని విశ్రాంతి ఉపాధ్యాయులు ఇనుకొండ వీరారెడ్డి ఒంటల హనుమంత రెడ్డి కి ఘనంగా సన్మానం చేశారు. జాతీయ ఛైర్మెన్ డా. కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఛైర్మెన్ డాక్టర్ నోముల సంపత్ గౌడ్ మాట్లాడుతూ..
సమాజంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుడు సమాజానికి అవసరమైనటువంటి ఉత్తమ విద్యార్థులను తయారు చేస్తూ వారిని డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, పోలీసులుగా దేశానికి కావలసినటువంటి విద్యార్థులను తయారు చేస్తూ, సమాజానికి సేవచేస్తున్న అలాంటి ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నోముల తిరుపతి గౌడ్, కొండం దుర్గారెడ్డి,గడ్డం లక్ష్మణ్, గడ్డం అరుణ్, నోముల అజయ్, బండారి పరుశరాములు, ముత్యాల రమణారెడ్డి సంపత్, తదితరులు పాల్గొన్నారు.




