విద్య

మొదటి రోజే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ

408 Views

మొదటి రోజే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ…

తిమ్మాపూర్ పాఠశాలలో పుస్తకాల పంపిణీ ప్రారంభించిన ఎంఈఓ

పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అందె సుభాష్, ఉపసర్పంచ్ పాలకవర్గ సభ్యులు.

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం మొదటి రోజునే మండల విద్యాధికారి గాలిపల్లి కృష్ణహరి విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని ఉచిత పుస్తకాలు, ఉచిత ఏకరూప దుస్తులు,మధ్యాహ్న భోజన సౌకర్యాలను కల్పిస్తుందని రానున్న రోజుల్లో ఉచిత రాసుకోవడానికి బుక్స్,ఉదయం అల్పాహారం అందించడానికి కృషి చేస్తుందని మండలంలోని విద్యార్థులు ఇట్టి ప్రభుత్వ ఉచిత సౌకర్యాలను నాణ్యమైన విద్యను ఉపయోగించుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అందె సుభాష్,ఉపసర్పంచ్ జజ్జరి దేవేందర్, వార్డు సభ్యులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *