
మోగిన బడిగంట
ఆదిలో అమాస సెంటిమెంట్
తగ్గిన హాజరు శాతం
TS తెలుగు న్యూస్ 24/7: రాష్ట్రంలో పాఠశాలలు సోమవారం పునః ప్రారంభం కాగా బడిగంట మోగింది.కాగా ఈ రోజు అమావాస్య ఉందన్న కారణంతో చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలకు పంపించ లేదనే ముచ్చట్లు వినవస్తున్నాయి.దాంతో పాఠశాలలో మొదటి రోజు హాజరు శాతం తగ్గిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.ఇది ముందే గమనించిన కొందరు ఉపాధ్యాయులు విద్యకు అమావాస్య అడ్డు కాదని ప్రచారం చేయడంతోనే ఆ మాత్రం విద్యార్థులు పాఠశాలకు హాజరైనట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికీ ఈ విద్యా సంవత్సరం అందరికీ శుభం కలగాలని కోరుకుందాం.





