విద్య

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

86 Views

 

-ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్

-జర్నీ టూ  స్పేస్ పేరిట కార్యక్రమం

-హాజరైన అదనపు కలెక్టర్ పూజారి గౌతమి

సిరిసిల్ల, మార్చి 14, 2024:

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ ఆకాంక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  జర్నీ టూ  స్పేస్  పేరిట కార్యక్రమాన్ని జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాలు, ప్రభుత్వ, పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థలకు గురువారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ మాట్లాడారు. కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ -1, గగన్ యాన్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. చంద్రయాన్ -3 లో బాగంగా వివిధ దశలు, తయారీ విధానం, రాకెట్ ప్రయోగాలు తదితర అంశాలను వెల్లడించారు. భూమి, సౌర వ్యవస్థ, గెలాక్సీ, యూనివర్స్ పై కూలంకుషంగా వివరించారు. అనంతరం ఇస్రో ఆధ్వర్యంలో చేపట్టనున్న ” యూవిక – 2024″ పోటీ పై రఘునందన్ కుమార్ తెలిపారు. జిల్లా నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని వాటికి అర్హత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీ ఈ ఓ రమేష్ కుమార్, జీసీడీఓ పద్మజ, డీఎస్ఓ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7