
సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
TS తెలుగు న్యూస్ 24 /7: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ సమ్మర్ క్యాంప్ ను సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి,ఎంఈఓ గాలిపల్లి కృష్ణహరి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,విద్యార్థులలో సృజనాత్మకత,నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.క్యాంప్‌లో డ్రాయింగ్,పెయింటింగ్,యోగా,క్విజ్‌లు,కథలు వినిపించడం,సాంస్కృతిక కార్యక్రమాలు వంటి విభిన్న కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా స్పందించారు.ఉపాధ్యాయులు క్యాంప్ ద్వారా విద్యార్థులకు చదువుతో పాటు జీవిత నైపుణ్యాలు కూడా పెంపొందించేలా కృషి చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం కొన్ని వారాల పాటు కొనసాగనుండగా, బొప్పాపూర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





