బెల్లంపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ ని ఇంకా బలోపేతం చేస్తాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం రాజయ్య.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రూరల్ లో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తానని నూతన కాంగ్రెస్ మండలం అధ్యక్షులు దుర్గం రాజయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన తన నివాసం లో మీడియా తో మాట్లాడారు. తన రాజకీయ నేపధ్యాన్ని గుర్తించి నాకు బెల్లంపల్లి రూరల్ మండల అధ్యక్ష పదవి ఇచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి, జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి కి అలాగే ఈ అవకాశం రావడానికి ప్రత్యేకంగా కృషి చేసిన స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ కారుకూరి రాంచందర్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అలాగే నాకు ఈ అవకాశం రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క శ్రేయోభిలాషులకు కూడా ధన్యవాదములు తెలిపారు. అనంతరం తన రాజకీయ నేపధ్యం గూర్చి వివరించారు. నేను కాంగ్రెస్ పార్టీ కి చేసిన సేవలను గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండలం లో అందరి సహాయ సహకారాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి శాయ శక్తుల కృషి చేస్తానన్నారు.





