
ప్రభుత్వ పాఠశాల 10వ తతరగతి మండల టాపర్లను అభినందించిన ఎంఈఓ కృష్ణ హరి
TS తెలుగు న్యూస్ 24/7: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు S.స్నేహలత572 (జడ్.పి.హెచ్.ఎస్ నారాయణ పూర్)మార్కులతో మండల ప్రథమ స్థానం,కాసారపు శ్రీకర్ 569 (జడ్.పి.హెచ్.ఎస్ వెంకటాపూర్) మార్కులతో ద్వితీయ స్థానం,దీప్తి 567 (జడ్.పి.హెచ్.ఎస్ బండలింగంపల్లి )అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండల విద్యాధికారి సన్మానించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణహరి మాట్లాడుతూ,విద్యార్థుల కష్టానికి తోడు ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణ,ప్రతిరోజూ నిర్వహించిన స్టడీ అవర్స్ ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు.వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఉత్తీర్ణులుగా చేయడంలో ఉపాధ్యాయులు సఫలీకృతమైందని పేర్కొన్నారు.పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ఫలితాలు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో నారాయణపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్,ఉపాధ్యాయులు రాజు,వెంకటాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణ హరి,శ్రీనివాస్,బండ లింగంపల్లి పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





