సమస్యల పరిష్కారానికి వినతి
తెలంగాణ సంఘిక సంక్షేమపాఠశాల జాయింట్ సెక్రెటరీ అనంత లక్ష్మీ TGPA రాష్ట జిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నర్సింలు అధ్వర్యంలో కలవడం జరిగింది
మన జిల్లా లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు గాను కొన్ని మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి . మిగతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సొంత భావనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి .
ఇక్కడ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
గురుకుల పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల ఇబ్బందులు కొన్ని మీదృష్టికి తీసుకు వస్తున్నాం.
ప్రధాన సమస్యలు
ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు తరగతి గదిని హాస్టల్ గదిగా వాడుకోవడం జరుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు విశ్రాంతి తీసుకోవడం. చదువుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే క్రీడ మైదానం లేక విద్యార్థిని విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఎదగలేక పోతున్నారు.
క్లీనింగ్ విషయంలో బ్లీచింగ్ పౌడర్ స్వీట్ స్వీపర్స్ ఫినాయిల్ సరిగ్గా లేనందువలన వర్షాకాలంలో పిల్లలకు ఈగలు దోమల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు .కావున వీరిని టెండర్లుగా కాకుండా పూర్తిస్థాయి సిబ్బందిగా నియమిస్తే బాగుంటుందని విన్నపిస్తున్నాం. మన పిల్లలకు ఇచ్చే
స్టేషనరీ మెటీరియల్ గురుకుల పాఠశాలల పున ప్రారంభోత్సవ సమయంలో అందించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటదని కోరుతున్నాం
మన అన్ని గురుకుల పాఠశాలల యందు మినరల్ ప్లాంట్లు లేనందున విద్యార్థులకు చర్మవ్యాధులు గొంతు నొప్పులు ఇంక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కావున ఇట్టి ప్లాంట్ల కోసం కృషి చేయగలరని కోరుతూ చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల చిన్న పిల్లలు స్నానాలు చేయలేకపోతున్నందున వేడి నీటి మిషన్లు పెట్టించగలరని కోరుతున్నాం
మన సిద్దిపేట జిల్లా గురుకుల పాఠశాలలకు కొన్నిచోట్ల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా ఉన్న స్థానంలో,పూర్తి స్థాయిలో విద్యార్థులకు చదువులో గాని పాఠశాలను పర్యవేక్షణలో గాని పూర్తిస్థాయి న్యాయం చేయలేకపోతున్నారు కావున రెగ్యులర్ ప్రిన్సిపాల్ లను నియమించగలరని కోరుతున్నాం.
మన గురుకుల పాఠశాలకు పూర్తిస్థాయి ప్రధాన ఉపాధ్యాయులు ( ప్రిన్సిపాల్) నియమిస్తే గురుకుల పాఠశాలలు సరియైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
పై విషయాలపై పూర్తిగా చర్చించి సమస్యలు పరిష్కరించి మా గురుకుల పిల్లల అభివృద్ధి కొరకు పాటుపడతారని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్(TGPA) జిల్లా కమిటీ కమిటీ తరఫున అడగడం జరిగింది
మేము అడిగిన సమస్యలను పరిశీలించి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో
అధ్యక్షులు
సానాది నర్సింగ రావు.
ప్రధాన కార్యదర్శి శ్రీరాములు వెంకటేశ్వర్లు. కోశాధికారి జాలిగామ నర్సింగరావు
ప్రచార కార్యదర్శి అల్లిబిల్లి బాబు
మిట్టపల్లి పాఠశాల ప్రధాన కార్యదర్శి సుంచూ మహేష్ . వర్గల్ (ప్రజ్ఞ పూర్ )పాఠశాల కమిటీ అధ్యక్షులు బాల శివ ప్రచార కార్యదర్శి అల్లిబిల్లి బాబు TGPA జిల్లా సీనియర్ నాయకులు ఎల్లయ్య. ఎన్సంపల్లి పాఠశాల అధ్యక్షులు _దయాకర్_ . స్వామి. కొండపాక పాఠశాల అధ్యక్షులు రవీందర్. ప్రజ్ఞాపూర్ పాఠశాల ఉపాధ్యక్షులు రామకృష్ణ.TGPA మిట్టపల్లి కమిటీ సభ్యులు బాబు సుంకరి బిక్షపతి. అన్ని గురుకుల పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
