ముస్తాబాద్, మే 1 (24/7న్యూస్ ప్రతినిధి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా సిఐటియు, సిడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు గీసబిక్షపతి ఆధ్వర్యంలో తెర్లుమద్ది గ్రామంలోని ముందస్తు జెండా ఎగరవేసేందుకు అంతర్జాతీయ దినోత్సవం కొనసాగించడానికి గీసబిక్షపతి ఆయా కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గీసబిక్షపతి మాట్లాడుతూ విశ్వంలో ప్రతిరోజూ ప్రతిపని సక్రమంగా జరుగాలంటే…అందుకు కారణం కార్మికుడే. కార్మికుడు తన చెమట చుక్కలను చిందించి, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. ’మే’ డే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా1886లో ఆరం
భమైన ఈ ఉద్యమం నేడు138 ఏళ్ల పండుగ జరుపుకో బోతోందన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సంఘటిత, అసంఘటిత కార్మికులు సన్నద్ధం అవు తున్నారున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, బీరయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.




